పార్కు స్థలాలు, చెరువులు కబ్జా చేస్తే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

పార్కు స్థలాలు, చెరువులు కబ్జా చేస్తే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్ : కూకట్ పల్లి నియోజకవర్గంలోని పార్కు స్థలాలు, చెరువులు కబ్జాకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. పార్కు స్థలాలు, చెరువులను కబ్జాకు పాల్పడుతున్న వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నట్లు చెప్పారు. కేపీహెచ్ బీ 9లోని సర్వే నెంబర్ 1009లో ఉన్న 2. 21 ఎకరాల్లో ఉన్న స్థలాన్ని పార్కుకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, దీనిపై మంత్రి స్పందించి జీఓ కూడా విడుదల చేశారని తెలిపారు.

రమ్య గ్రౌండ్ లో ఉన్న 2 ఎకరాల స్థలంలో జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, వచ్చే నెలలో భవన నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. పాఠశాల ఏర్పాటుకు కేపీహెచ్ బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కోటి రూపాయల విరాళం అందజేస్తున్నారని చెప్పారు. ఈ పాఠశాలను నందమూరి తారకరామారావు పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.