ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని అరెస్ట్ చేయాలె

ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని అరెస్ట్ చేయాలె

బీజేవైఎం, జర్నలిస్ట్ యూనియన్ల డిమాండ్

మల్కాజిగిరి, వెలుగు: జర్నలిస్టును బూతులు తిట్టి బెదిరించిన పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని వెంటనే అరెస్ట్​ చేయాలని బీజేవైఎం స్టేట్​ ప్రెసిడెంట్​భానుప్రకాష్​ డిమాండ్​ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై దాడులు పెరిగిపోయాయని, చివరకు జర్నలిస్ట్ లను కూడా వదలడం లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మల్కాజిగిరి చౌరస్తాలో బీజేవైఎం, బీజేపీ, జర్నలిస్ట్​ సంఘ నాయకులు ఆందోళన చేశారు. అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టును బెదిరించిన ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్​, రాజ్యలక్ష్మి, నాయకులు శేఖర్ ​యాదవ్, బక్క నాగరాజు  పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి:  ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేస్తూ కూకట్​పల్లి దళిత బహుజన జర్నలిస్ట్​ ఫోరం ఆధ్వర్యంలో హైదర్​నగర్​లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు.   ఫోరం అధ్యక్షుడు ఎన్. రవీందర్, ఉపాధ్యక్షుడు మహేందర్, కోశాధికారి బుల్లెట్ రవి, ఆలిండియా అంబేద్కర్​ సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం ఉన్నారు.

ఉప్పల్: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని  అరెస్ట్ చేయాలని  ఉప్పల్​ ప్రెస్​ క్లబ్​ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఉప్పల్​ ప్రెస్ ​క్లబ్​ సభ్యులు తిరుపతిరెడ్డి, చంద్రమౌళి, వెంకట్రామిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు.

For More News..

అన్​నోన్​ యాప్స్ తో జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలోఅయితే చాలు..

సర్పంచ్‌‌‌‌లూ.. మీ సమస్యలేంది? గ్రామాల్లో ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాల ఆరా

కేసీఆర్ కోతలు కోయడానికే ఢిల్లీకి పోయిండు