బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

పాలకుర్తి, వెలుగు: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి గాలి దుమారానికి ఇంటి పైకప్పు లేచిపోయి ఇబ్బందులు పడుతున్న  బాధితులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని  రెడ్డి మంగళవారం పరామర్శించారు.  మండల కేంద్రంలో రాపర్తి లక్ష్మి, రామ చంద్రయ్య రేకుల షెడ్డులోని కిరాయి ఇంట్లో ఉంటున్నారు.  సోమవారంబలమైన ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. 

 దీంతో లక్ష్మి భర్త రామచంద్రయ్యకు స్పల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితుల ఇంటికి వెళ్లి  పరామర్శించారు. బాధితులకు అవసరమైన నిత్యావసర సరకులు అందించారు.  కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.