పదేండ్ల తర్వాత పేదలకు రేషన్ కార్డులు

 పదేండ్ల తర్వాత పేదలకు రేషన్ కార్డులు

పెనుబల్లి, వెలుగు: పదేండ్ల తర్వాత కాంగ్రెస్​ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు అందాయని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రూ.34 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, రూ.9.85 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గత బీఆర్​ఎస్​ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, పేదల కడుపు నింపేందుకు సన్న బియ్యం ఇస్తున్నామని, హాస్టల్ విద్యార్థులకు ఒకేసారి 40 శాతం డైట్ చార్జీలు పెంచామన్నారు. కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, తహసీల్దార్ నారాయణమూర్తి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ వచ్చాకే పథకాలు అందుతున్నయ్ 

తల్లాడ వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. శనివారం తల్లాడ రైతు వేదికలో రూ2.40 లక్షలు విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రూ.73 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తహసీల్దార్ సురేశ్ కుమార్, ఆర్ఐ భాస్కర్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, నూతనకల్ సొసైటీ చైర్మన్ తూము వీరభద్రం, నాయకులు పాల్గొన్నారు. 

సీఎంఆర్ ఎఫ్ తో పేదలకు చేయూత

కల్లూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్​ఎఫ్​ద్వారా పేదలకు ఆర్థిక చేయూతనిస్తోందని ఎమ్మెల్యే రాగమయి  అన్నారు. శనివారం కల్లూరు రైతు వేదికలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి 112 మంది లబ్ధిదారులకు రూ.50.85 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. తహసీల్దార్​సాంబశివుడు, ఎస్సై హరిత, మున్సిపాలిటీ మేనేజర్ నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆలకుంట నరసింహారావు, నాయకులున్నారు.