పేదలకు అండగా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

పేదలకు అండగా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  •     ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినిపల్లి, వెలుగు: పేదలకు అండగా ఉంటూ, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం బోయినిపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌ చెక్కులు అందజేశారు. 

అంతకుముందు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. జగ్గారావుపల్లి వద్ద పెద్దమ్మ ఆలయం నుంచి దుబ్బపల్లి వరకు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.