
గంగాధర/బోయినిపల్లి, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం కురిక్యాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఐకేపీ సెంటర్లు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా చేస్తున్నామన్నారు.
అనంతరం 328 మహిళా సంఘాలకు మంజూరైన రూ.38.20 కోట్లు, 5,273 సంఘాలకు రూ. 6.92 కోట్లు, ఆరుగురు సభ్యులకు ప్రమాద బీమా కింద రూ.60 లక్షలు, 54 మంది సభ్యులకు లోన్ బీమా కింద రూ.48.52 కోట్లు, స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్‌కు రూ.20.83 లక్షలు, ఐదు మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు రూ.1.54 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీల చైర్మన్లు కొత్తూరు మహేశ్, జాగిరపు రజిత-, బొమ్మరవేణి తిరుమల- తిరుపతి, బోయిని ఎల్లేశ్, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ తిర్మల్రావు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన వేముల మహన్య చికిత్సకు రూ. లక్ష ఎన్‌వోసీ లెటర్ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉపేందర్ ఉన్నారు.
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: కవ్వంపల్లి
తిమ్మాపూర్, వెలుగు: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యానారాయణ పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన జరిగిన మహిళా శక్తి సంబురాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ. 7కోట్లు వడ్డీ లేని రుణాలు అందజేసినట్లు చెప్పారు.
డీఆర్డీవో శ్రీధర్, తహసీల్దార్శ్రీనివాస్రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో సురేందర్, ప్రాజెక్ట్మేనేజర్లు సుధారాణి, తిరుపతి, వెంకట్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రమేశ్, లీడర్లు శ్రీనివాసరావు, రమణారెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.