ఆడపిల్లలు పుట్టడానికి కారణం చెప్పిన ఎమ్మెల్యే

ఆడపిల్లలు పుట్టడానికి కారణం చెప్పిన ఎమ్మెల్యే

ఆడపిల్లలు జన్మించడానికి గల కారణం ఏంటో అసెంబ్లీలో వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వివరించారు.. ఆడపిల్లలు పుట్టడానికి  సైంటిఫిక్ గా మగాడే కారణమని ఆడవాళ్లు ఏ మాత్రం కారణం కాదన్నారు. భార్యభర్తల నుంచి వచ్చే XY క్రోమోజోములే కారణమని తెలిపారు. 

‘సైంటిఫిక్ గా భార్య లోపల X  క్రోమోజోమ్ లు మాత్రమే ఉంటాయి, భర్త లోపల XY క్రోమోజోములుంటాయి. భార్య నుంచి వచ్చిన X క్రోమోజోమ్, భర్త నుంచి వచ్చిన X క్రోమోజోమ్(XX) కలిస్తే ఆడపిల్ల పుడ్తది. భర్త నుంచి వచ్చిన Y క్రోమోజోమ్ భార్య నుంచి వచ్చే X క్రోమోజోమ్(XY) తో కలిస్తే మగపిల్లలు పుడ్తరు.  Y క్రోమోజోమ్  మగవాళ్ల నుంచి రిలీజ్ కాకపోవడంతోనే ఆడపిల్లలు జన్మిస్తున్నారు. అంటే  ఆడపిల్లలు పుట్టడానికి కారణం మగవాళ్లు.. కాబట్టి మగ వారినే  కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేయాలి’ అని ఎమ్మెల్యే ఆనంద్ వ్యాఖ్యానించారు.