శేరిలింగంపల్లిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మునిరత్నం నాయుడు

శేరిలింగంపల్లిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మునిరత్నం నాయుడు
  • కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు

చందానగర్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం నాయు డు పిలుపునిచ్చారు. గురువారం మియాపూర్​లోని బీజేపీ ఆఫీసులో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. శేరిలింగంపల్లి ఇన్​చార్జి గజ్జల యోగానంద్​తో కలిసి మునిరత్నం చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి శేరిలింగంపల్లిలో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు. యోగానంద్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సెగ్మెంట్​ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 
కార్యకర్తలు, నాయకులంతా నిరంతరం ప్రజా సేవలో ఉంటూ పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.