ఆధ్యాత్మికం.: ఏది రైట్ .. ఏది రాంగ్.. ఇలా ఆలోచిస్తే... భయం .. ఆందోళన అన్ని ఎగిరిపోతాయి..!

ఆధ్యాత్మికం.:  ఏది రైట్ .. ఏది రాంగ్.. ఇలా ఆలోచిస్తే... భయం .. ఆందోళన అన్ని ఎగిరిపోతాయి..!

వాళ్లు నన్ను అవమానించారు... హర్ట్ చేశారు... నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలా కంట్రోల్ తప్పి మనను ఆలోచనల వెంట పరుగులు తీస్తుంది. ఇంతకీ ఆ ఆలోచనల్ని సృష్టిస్తున్నది ఎవరు? వాటిని కంట్రోల్ చేస్తున్నది ఎవరు? మనసు ఎప్పుడు ప్రశాంతంగా మారుతుంది? హర్ట్ చేసినవాళ్లు వచ్చి క్షమాపణ చెప్పినప్పుడా? ఆలోచనలు అడిగినప్పుడా..?  ఇలా ఎన్నో విషయాలు సిడ్నీకి వెళ్లినప్పుడు తన ఫాలోవర్స్​ కు  చెప్పారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బ్రహ్మకుమారి బీకే శివాని.

నేను రైట్.. నువ్వు రాంగ్!

ఎవరైనా అతిథులు ఓ మూడు నిమిషాలు సైలెంట్ గా ఉండండి అని చెప్తుంటారు. కానీ, ఆ మూడు నిమిషాలు సైలెంట్ గా కూర్చోవడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు.ఏం చేయాలో అర్థం కాక, మూడు నిమిషాలు ఎలా గడపాలి' అని ఉక్కిబిక్కిరవుతారు.


మనిషి కనుగొన్న చిన్న బొమ్మ మన సైలెన్స్ ను చెడగొడుతోంది. విమానంలో వెళుతుంటే.. ఏం చేయకుండా సైలెంట్ గా కూర్చునేవాళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే ఏం ఆలోచించకుండా సైలెంట్​ గా  వెయిట్ చేసేవాళ్లు. కానీ, మొబైల్ జేబులోకి వచ్చినాక కాసేపు ఖాళీగా కూర్చోవడానికి కూడా టైమ్ లేకుండా పోయింది. నిమిషం గ్యాప్ దొరికితే చాలు.. ఫోన్ తీసి అన్నీ చెక్ చేసుకుంటారు. ఎప్పుడూ ఫోన్​ లో  నుంచి ఏదో ఒక సమాచారాన్ని మైండ్​లో  నింపేస్తున్నారు. దీని వల్ల ఖాళీగా కూర్చునే ప్రాక్టీస్​ ను  కోల్పోయారు. కొన్ని నిమిషాలు కూడా ఖాళీగా, సైలెంట్ గా కూర్చోలేని వాళ్లే..  నా మైండ్ నా కంట్రోల్ లో లేదు' అంటుంటారు...

ఎవరు సృష్టిస్తున్నారు

నాదే  మైండ్... అంటే అది నాకు పుట్టిన బేబీతో సమానం. నేను పదేళ్లుగా క్రమశిక్షణతో లేకున్నా. నేను ఇది చేయగలను అని అనుకున్న రోజు అది చేసి తీరుతుంది.. ఎందుకంటే అది నా మైండ్. మరి నా ఆలోచనల్ని సృష్టిస్తున్నది ఎవరు? ఆలోచించండి! మైండే..! అవును మనిషి మైండే తన ఆలోచనలు సృష్టిస్తుంది. మీరు నన్ను అవమానించారు. మీరు నాకు కోపం తెప్పించారు. నన్ను బాధ పెట్టారు. నాకు కోపం తెప్పించకు' ఇలాంటి మాటలు చాలామంది అనేస్తుంటారు. కానీ, కోపం పుట్టేది వాళ్ల మైండ్ లోనే ! మరి ఆ కోపాన్ని పుట్టించింది ఎవరు? చిరాకు పెట్టిన వ్యక్తా? లేక నీ బుర్రా అనేది ఆలోచించాలి.

ఇదే డిటాచ్​మెంట్..

నేను ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు మారాలి? ఈ ప్రవర్తన ఇరిటేషన్ పల్ల పుట్టింది. అందరూ ఇరిటేట్ చేస్తున్నారు? ఇక, ఎలా ప్రశాంతంగా ఉండేది? అనుకుంటారు.  మరి ఈ ఆలోచనల  వేగాన్ని తగ్గించాలంటే. ..బాధపెట్టిన వాళ్లు మారాలి అందుకే నువ్వు కొంచెం మారు అని వాళ్లను రిక్వెస్ట్ చేస్తుంటారు. కానీ  రిక్వెస్ట్ చేసిన కొద్దీ, వాళ్లు ఇంకా ఎక్కువ చేస్తుంటారు. 'వాళ్లు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు' అనే ఒక గుడ్డినమ్మకం వల్లే తమకు ప్రశాంతత లేదని అర్ధం చేసుకోరు. మనం వాళ్ల ప్రవర్తనకి తగ్గట్లే ఉండాలా? సైలెంట్ గా ఉండాలా? అంటే ఒకసారి కళ్లు మూసుకోవాలి కోసం తెప్పిస్తున్న వ్యక్తిని, అతని ప్రవర్తనని ఊహించుకోవాలి తర్వాత వాళ్లలాగే నేను ప్రవర్తిస్తున్నానా? అని ఆలోచించాలి. ఏది సరైన దారి? ప్రశాంతంగా వాళ్లతో ఉండగలనా? వాళ ప్రవర్తనని ప్రశ్నించకుండా ఉండేందుకు ఏదైనా ఆప్షన్ ఉందా? అని లోతుగా ఆలోచిస్తే.. వాళ్ల ప్రవర్తన నుంచి మీ మైండ్ ని డిస్​ కనెక్ట్​  చేసేస్తారు. ఇదే డిటాచ్ మెంట్.   నా మైండ్ వాళ్ల ప్రవర్తనకు కనెక్ట్ చేయకుండా ఉంటే దాన్నే డిటాచ్ మెంట్ అంటారు.

అసలు కారణం ఇదే...

"ఈ పువ్వు నాకు ఇష్టం లేదు. మీలో ఎంతమందికి ఈ పువ్వు ఇష్టం? (కొంత మంది చేతులు లేపారు). మరి మీరు రైటా? నేను రైటా అంటే ఇద్దరూ రైటే! నేను రైట్.. నువ్వు రాంగ్' అని ఎవరికివాళ్లు అనుకోవడమే అన్ని గొడవలకు కారణం.అదే మిస్ అండర్ స్టాండింగ్. అవతలి వ్యక్తి ఆలోచనా పద్ధతి అర్ధం చేసుకోలేనప్పుడు.. వాళ్ళు డిఫరెంట్  అవడానికి బదులు ...వాళ్లు రాంగ్ అనేస్తుంటారు. ఇదే రిలేషన్ షిప్ నుంచి మొదలు పడితే బిజినెస్​ లు , వర్క్​ ప్లేస్​ ల్లో   ఉండే అన్ని రకాల గోడవలకు కారణం!!

 నేను ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు ఇష్టమైంది. తేలేదు  గౌరవం ఇవ్వలేదని ఆలోచిస్తూ నా శక్తిని వృథా చేసుకోకుండా.. ఆ ఆలోచనల్ని డిస్​కనెక్ట్​చేసేస్తా..  భార్య, భర్త లేదా బాస్ ఇలా ఇంకెవరైనా కావొచ్చు వాళ్లతో మీ ఆలోచనల్ని డిస్​ కనెక్ట్​  చేసుకోవాలి. వాళ్లు రైటా? రాంగా.. ! అనేది ప్రశ్న కాదు. వాళ్లు నా ఎమోషన్స్ క్రియేట్ చేయడం లేదు. వాళ్ల ప్రవర్తనకి  ప్రతిస్పందనగా... ఎమోషన్స్ పుడుతున్నాయి. అంటే ఎవరు నన్ను బాధ పెడుతున్నారు"

ఎప్పటి వరకు

'వాళ్లు మోసం చేశారు. వాళ్లు అబద్దం చెప్పారు. కానీ, ఎవరు నన్ను బాధపెట్టారు? నేనే!నేను సృష్టించుకున్న ఆలోచనే. నన్ను బాధ పెట్టింది. ఎదుటి వాళ్ల శక్తి మీకు అవతలే ఉంటుంది. దగ్గర ఉన్న శక్తి. నా లోపల ఉంటుంది. దాన్ని ఎవరూ ముట్టుకోలేరు. ఎవరైనా జీవితాంతం బాధపడతారా? కొంత మంది రెండు నిమిషాలు బాధ పెడితే, ఇంకొంతమంది ఇరవై రోజులు. బాధపెడతారు. తర్వాత మనకు ఆ ఆలోచన కూడా ఉండదు. ఆ స్టేజికి చేరుకుంటే.. పరమాత్మతో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అందమైన ఆలోచనలు పుడతాయి. ఇప్పుడు నిన్ను బాధ పెట్టినవాళ్లను ఆశీర్వదించు.. ఎందుకంటే వాళ్లు బాధలో ఉన్నారు.

సారీ చెప్పినా..

ఎదుటి వాళ్లు బాధ పెడితే.. దాన్నుంచి ఎప్పుడు బయటపడ్డారు? వాళ్లు మారినప్పుడా? లేక మిమ్మల్ని క్షమాపణలు అడిగినప్పుడా? ఒకవేళ వాళ్లు 'సారీ' చెప్పినా కూడా నో.. నువ్వు రియలైజ్ కాలేదు అని పంపించేస్తుంటారు. వీళ్లేమో వాళ్ల బాధ తగ్గేవరకూ 'సారీ... సారీ' అనుకుంటూ తిరుగుతారు. మూడు, నాలుగు రోజుల తర్వాత అన్ని సారీలు విన్న తర్వాతమైండ్ కి ఉపశమనం కలుగుతుంది. దీన్నే లైఫ్ ఆఫ్ డిపెండెన్నీ అంటాం. కానీ, ఆ ఆలోచనల నుంచి డిస్ కనెక్ట్ అయిన మైండ్​ కు  మాత్రం ఆ క్షణమే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఆమైండ్ ఏడవడం ఎప్పుడో మానేసింది.

కొందరు చెప్పరు...

కొంతమంది. ఎందుకు 'సారీ' చెప్పురు? అంటే వాళ్ల అభిప్రాయం ప్రకారం వాళ్లు తప్పు చేయలేదని అర్థం. వాళ్లు క్షమాపణ చెప్పకున్నా.. నా జీవితం నేను బతుకుతాను' ఇదే ఆధ్యాత్మికం మనకు బోధిస్తుంది? నా అంతట నేను బయటపడకపోతే ఎలా? ఒకవేళ ఈ శరీరాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. అది ఏ నిమిషంలోనైనా రావొచ్చు నేను బతికే ఉంటా అనేదానికి గ్యారెంటీ లేదు. ఈ మధ్యలోనే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోతే, తొమ్మిది నెలల తర్వాత మరో వేషంలో మరోఇంట్లో పుడతాను. నన్ను హర్ట్ చేశారు అనే విషయం ఆత్మ సీడీలో అలాగే ఉండిపోతుంది. అంటే, ప్రతి కర్మఆత్మతో ప్రయాణిస్తుంది.

ట్రాఫిక్ జామ్

మన లోపలి ప్రపంచంలో జరుగుతున్న దానికి పరిస్థితుల్ని వ్యక్తుల్ని బ్లేమ్ చేయకూడదు. వాళ్ల శక్తి బయటి వరకే పరిమితం  లోపలున్న -శక్తిని ఎవరూ టచ్ చేయలేరు ట్రాఫిక్ జామ్​లో ఇరుక్కుపోతే.. చిరాకు పడకుండా ఉండాలంటే. ట్రాఫిక్ జామ్ రోడ్డు మీదే... కానీ, మైండ్​లో, కాదని గుర్తుంచుకోవాలి. ఈ సిటీ, ఈ రోడ్డు ఇంతే' అని అంతం లేని ఆలోచనలు పుడితే... అప్పుడు ట్రాఫిక్​  మైండ్​ లో  జామ్ అవుతుంది. కాబట్టి, పరిస్థితి నుంచి మైండ్​ని డిస్ కనెక్ట్ చేయాలి. అవసరం లేని వాటి గురించి ఆలోచించినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. రోజూ ఇవన్నీ నేర్పకుంటే శక్తినివ్వకుంటే మైండ్​ వీక్ అవుతుంది.  వీక్​ మైండ్ ఎక్కువగా ఆలోచిస్తుంది. దానికి రెస్ట్ ఇవ్వకుంటే... సాధారణ విషయాలు కూడా ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి.. 'ఓవర్ థింకింగ్" నార్మల్ అయినప్పుడే ఒత్తిడి నార్మల్ అవుతుంది. భయం. ఆందోళన అన్నీ ఎగిరి పోతాయి!

వెలుగు,లైఫ్​