ఆధ్యాత్మికం: ముక్తి కలగాలంటే .. ఈ లక్షణాలు ఉండాల్సిందే.. భారతంలో విదురుడు చెప్సిన నీతి సూత్రాలు ఇవే..!

ఆధ్యాత్మికం:   ముక్తి కలగాలంటే  .. ఈ లక్షణాలు ఉండాల్సిందే..  భారతంలో విదురుడు చెప్సిన నీతి సూత్రాలు ఇవే..!

మనిషి నిత్యం తప్పుల వంతెనపై నడుస్తుంటాడు. అబద్దాలు, ఈర్షా ద్వేషాలు పట్టుకొని పోతుంటాడు. ఇక్కడ మనిషి శాశ్వతం కాదని తెలుసుకొని.. 'ముక్తి పొందాలంటే ఇలా నడుచుకోవాలి' అని భారతంలో విదురుడు కొన్ని నీతి సూత్రాలు చెప్పాడు. అవేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. . !

బుద్ధి ఒక్కటే. దాంతో చెయ్య తగినది...చెయ్యరానిదీ ఏంటో నిర్ణయించుకోవాలి. సామ, దాన, భేద, దండోపాయాలతో స్నేహితుడిని, తటస్థంగా ఉన్నవాడిని, శత్రువుని...ఈ ముగ్గురినీ వశపరచుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహించుకొని వ్యామోహం, జూదం, వేటాటడం,మద్యం సేవించడం, పుల్లవిరిచినట్లు మాట్లాడటం, క్రూరంగా శిక్షించడం, దుబారా ఖర్చులు చేసి డబ్బు నాశనం చేయడం వదిలేస్తే.. సుఖం కలుగుతుంది.

 విషం పుచ్చుకున్న వాడిని ఒక్కడినే చంపుతుంది. కత్తి దెబ్బ కూడా ఒక్కడినే కడతేరుస్తుంది. ఉన్న మంచి పదార్థాలన్నీ ఒక్కడే తినకూడదు. ఒక్కడే కూర్చొని ఏ ఆలోచనా చేయకూడదు. దూరదేశాలు వెళ్లవలసి వస్తే ఒక్కడే వెళ్లకూడదు. సత్యం ఒక్కటే తెలుసుకోదగ్గది. సత్యాన్నే పలకాలి. సత్యమే స్వర్గానికి మెట్టు.సముద్రంలో ప్రయాణం చేసే వాడికి ఓడ ఎలాంటిదో. ఈ లోకంలో బతికేవాడికి సత్యం కూడా అలాంటిది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం మాత్రం. వీడకూడదు' అని విదురుడు వివరించాడు

వెలుగు,లైఫ్​