నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి, ఏడుగురికి గాయాలు

నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి, ఏడుగురికి గాయాలు
  • తిమ్మనపల్లి దగ్గర కల్వర్టును ఢీకొన్న క్రూజర్ వెహికల్  
  • డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ప్రమాదం
  • కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న క్రూజర్ వెహికల్ 

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మనపల్లి సమీపంలో క్రూజర్ వెహికల్ కోదాడ, జడ్చర్ల హైవేపై కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.  

కర్ణాటక నుంచి శ్రైశైలం వెళ్తున్నక్రూజర వెహికల్..శుక్రవారం (ఫిబ్రవరి 14) తెల్లవారు జామున తిమ్మనపల్లి సమీపిస్తుండగా వేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని  పోలీసులు భావిస్తున్నారు. 

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. గాయపడిన వారిని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ తో సహా 11 మంది  ఉన్నట్లు సమాచారం.