- ఎమ్మెల్యే రోహిత్ రావు
చిన్నశంకరంపేట, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట, మిర్జాపల్లి తండాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. మిర్జాపల్లి గ్రామ చెరువులో, గజ గట్లపల్లి చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేసినా భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. తాను ఎలక్షన్ల ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ డబ్బుతోపాటు, సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
మీర్జాపల్లి తండాలో 22 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా 17 ప్రారంభమ్యాయని, అందులో 5 నిర్మాణం పూర్తిచేసుకుని నేడు గృహప్రవేశం చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, డీఈఈ యాదగిరి, ఏఈ లోకేశ్, ఎంపీడీవో దామోదర్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు, శ్రీమాన్ రెడ్డి, రమణ, యాదవరావు, జనార్ధన్, రాజిరెడ్డి, మోహన్ నాయక్ పాల్గొన్నారు.
