ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, వెలుగు: ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియగించుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు​ సూచించారు. బుధవారం ఇందిరాగాంధీ  జయంతి, 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా  జిల్లా గ్రంథాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎమ్యెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. 

అనంతరం పాత నాణేల ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల విజయాలను గుర్తించడం, సమానత్వంపై వారికి అవగాహన కల్పించడమే మహిళా దినోత్సవ ఉద్దేశమన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​ సుహాసిని రెడ్డి, కార్యదర్శి వంశీకృష్ణ, లైబ్రేరియన్ యాదగిరి పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్​పోటీలు ప్రారంభం  

మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాయ్స్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. తర్వాత కాసేపు బ్యాటింగ్​చేసి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ పోటీల్లో ఎంపికైన వారిని ఇదే నెల చివరి వారంలో మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు తెలిపారు. పీఈటీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరాజు, టోర్నమెంట్ కన్వీనర్ మాధవరెడ్డి, పీడీలు శ్రీధర్ రెడ్డి, శ్యామయ్య, దేవేందర్ రెడ్డి, రమేశ్, శ్రీకాంత్ గౌడ్, అఫ్రీన్ ఫాతిమా, మధు, నరేశ్, రవి, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.

రంగవల్లులు, మెహందీ పోటీలు

సంగారెడ్డి టౌన్, వెలుగు: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో రంగవల్లులు, మెహందీ పోటీలు నిర్వహించారు. వివిధ కళాశాలలు, పాఠశాలల  విద్యార్థినులు హాజరయ్యారు. విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​అంజయ్య తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు.