హన్మకొండను జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మెల్యే నరేందర్

హన్మకొండను జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మెల్యే నరేందర్

వరంగల్ అర్బన్ : జిల్లాల ఏర్పాటు వివాదం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ మొదలైంది. వరంగల్ తూర్పు నియోజక వర్గం హెడ్ క్వార్టర్స్ గా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. హన్మకొండ పేరుతో ఈ జిల్లాను ప్రకటించాలని ఆయన కోరారు. హన్మకొండ నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఐతే.. స్థానిక ప్రజల డిమాండ్ కారణంగా.. జిల్లా పేరు మార్పు తప్పనిసరిగా చేయాల్సిందే అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు MLA నన్నపునేని నరేందర్.