
నల్లబెల్లి, వెలుగు: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేఖంపల్లికి చెందిన బీఆర్ఎస్ కు చెందిన 20 కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు చుక్క రమేశ్, మాజీ సర్పంచ్ ఎర్రల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగరావు, ఇంగోలి రాజేశ్వరరావు, పొన్నం జనార్దన్, జంగిలి రవి, భరత్ రెడ్డి, రాజేశ్, నగేశ్, నాగరాజు, రవి, కుమారస్వామి, గడ్డం రజనీకాంత్ పాల్గొన్నారు.