
ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు హై-స్పీడ్ డేటా, కాల్ కనెక్టివిటీని మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ఈ రేసులో భారతదేశం మరో అడుగు ముందుకు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలోకి ఓ ఉపగ్రహాన్ని పంపబోతోంది, ఇది భూమి అంతరిక్షం మధ్య కనెక్టివిటీని సృష్టిస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా హై-స్పీడ్ డేటా యాక్సెస్ చేయవచ్చు. దీని సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికాం కంపెనీలు 3G, 4G, 5G సేవలను అందించగలవు.
బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహం : ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మాట్లాడుతూ భారతదేశం త్వరలో అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం 'బ్లాక్-2 బ్లూ బర్డ్'ను ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం బరువు 6,500 కిలోలు. దీనిని శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుండి ఇస్రో అత్యంత బరువైన రాకెట్ LVM-3-M5 ద్వారా ప్రయోగించనున్నారు.
12Mbps వరకు డేటా స్పీడ్ : ఈ ఉపగ్రహం గురించి వి.నారాయణన్ మాట్లాడుతూ 'బ్లాక్-2 బ్లూ బర్డ్' 2,400 చదరపు అడుగుల వరకు పెద్ద కమ్యూనికేషన్ రేంజ్ ఉందని చెప్పారు. ఈ ఉపగ్రహం 12Mbps వరకు డేటా స్పీడ్ అందించగలదు. అంటే ఈ ఉపగ్రహం ద్వారా 12mbps వరకు డేటా స్పీడ్ ఉంటుంది. ఈ ఉపగ్రహం సహాయంతో ప్రజలు సిగ్నల్ లేకున్న స్మార్ట్‌ఫోన్‌ల నుండి కాల్స్ చేయగలరు, డేటా ఉపయోగించవచ్చు, వీడియోలను చూడొచ్చు. దీని కోసం ప్రత్యేక టెర్మినల్ లేదా రిసీవర్ అవసరం లేదు. ఈ ఉపగ్రహం AST & సైన్స్ టెక్నాలజి ఉపయోగిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఉపగ్రహం సహాయంతో మొబైల్ ఫోన్‌లు నేరుగా అంతరిక్షానికి కనెక్ట్ అవ్వగలవు. ఈ ఉపగ్రహం 3GPP-స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవ్వగలదు. సమాచారం ప్రకారం, ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 2025లో భారతదేశానికి రావచ్చు, ఆ తర్వాత దీనిని ప్రయోగిస్తారు. ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌తో పాటు , జియో & ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు కూడా భారతదేశంలో ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రారంభించడానికి అనుమతి పొందాయి.