
హసన్ పర్తి, వెలుగు: అర్హులందరికీ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హసన్పర్తి మండలం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 55, 56, 65, 66 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మకూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, హసన్పర్తి మండలాధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డబుల్బెడ్రూం ఇండ్ల పరిశీలన..
ఖిలావరంగల్ (మామునూరు): వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్లో నిర్మించిన 320 డబుల్బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత్బాజ్పాయ్లతో కలిసి పరిశీలించారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. వారివెంట జడ్పీ సీఈవో రామిరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ పాల్గొన్నారు.