రుచికరమైన భోజనం అందించాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రుచికరమైన భోజనం అందించాలి  : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీచర్లకు సూచించారు. సోమవారం చండూరు పట్టణంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో ఆహార పదార్థాలు, కూరగాయలను పరిశీలించారు. వంటలను రూచి చూశారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిన ఆహారంలో నాణ్యత పెరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు వండిన ఆహారానికి పొంతన లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థినుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కోడి శ్రీనివాస్, కొరిమి ఓంకారం, అనంత చంద్రశేఖర్ గౌడ్, గంట సత్యం, కోడిగిరి బాబు, మారయ్య తదితరులు ఉన్నారు.