Saiyaara OTT: ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ‘సైయారా’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Saiyaara OTT: ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ‘సైయారా’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ మూవీ ‘సైయారా’ (Saiyaara).ఈ 2025 ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్గా నిలిచిన సినిమా ఇది. జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు, ప్రపంచవ్యాప్తంగా రూ. 541.13 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.319.85 కోట్ల నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సినిమా రిలీజై 25 రోజులు గడిచినప్పటికీ.. ఇంకా చాలా థియేటర్లో రన్ అవుతూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. తొలిసారి నటించిన నటీనటులతో ఇంత పెద్ద విజయం సాధించడం బాలీవుడ్‌లో ఇదే మొదటిసారి. అంతేకాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ స్టోరీగా నిలవడం విశేషం.

అలాగే, ఈ సినిమా నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF)చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా ‘సైయారా’ నిలిచింది. షారుఖ్ ఖాన్ 'పఠాన్' రూ. 543.05 కోట్లు వసూలు చేయగా సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' రూ. 339.16 కోట్లు రాబట్టింది. తర్వాత 'సైయారా' నిలిచింది. ఇప్పుడీ ఈ సెన్సేషనల్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారందరీ వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

సైయారా ఓటీటీ:

సైయారా డిజిటల్ ప్రీమియర్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ థియేటర్లో రన్ అవుతుండగానే ఓటీటీ వివరాలు బయటకి రివీల్ చేయడం ఆసక్తి కలిగిస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో సైయారా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్‌ చేసింది.

ఓటీటీఫ్లిక్స్ ప్రకారం సైయారా సెప్టెంబర్ 12,2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని స్టోరీ ద్వారా వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని, సైయారా మేకర్స్ యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించాల్సి అవసరం ఉంది.