దేవరకొండ, వెలుగు: దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఈ నెల11న జరిగే రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం దేవరకొండ పట్టణంలోని 10,11,13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ, ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ పీఎసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, కోండూరుపవన్ కుమార్, కౌన్సిలర్ అభ్యర్థులు పున్న శైలజ వెంకటేశ్వర్లు చందన తదితరులు పాల్గొన్నారు.
