వివేక్ వెంకటస్వామిని సన్మానించిన కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే

వివేక్ వెంకటస్వామిని సన్మానించిన కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామిని కర్నాటకలోని కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే దొడ్డన గౌడ హెచ్ పాటిల్ సన్మానించారు. ఎన్నికల టైమ్ లో ఈ నియోజకవర్గానికి వివేక్ ఇన్ చార్జ్ గా వ్యవహరించారు.

శనివారం అభినందన కార్యక్రమంలో భాగంగా తన గెలుపు కోసం విశేష కృషి చేసిన వివేక్ ను పాటిల్ సన్మానించారు. కుష్టగి తాలూకాలో విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో సమృద్ధి మల్టీపర్పస్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అబాకస్ బుక్స్, ఇతర వస్తువులను వివేక్ పంపిణీ చేశారు.