
- ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సొమవారం బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి హాస్పిటల్ హాలులో టెన్త్, ఇంటర్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు, శాలువాలతో సత్కరించారు. ప్రైవేటు స్కూల్, కాలేజీలు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనరల్ హాస్పిటల్ కోసం భూమి పూజ చేశారు.
టెన్త్ టాపర్ క్రితికి సన్మానించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షలో రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించిన సిర్ప క్రితిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నగరంలోని ఆయన ఇంట్లో సోమవారం సన్మానించారు. క్రితి 596 మార్కులు పొందడం ఆషామాషీకాదన్నారు. స్టూడెంట్ను తీర్చిదిద్దిన కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ మేనేజ్మెంట్ను అభినందించారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్ తాహెర్, స్కూల్ డైరెక్టర్ సీహెచ్రజినీకాంత్, ప్రిన్సిపాల్ ఎండి.ఫరీదుద్దీన్, డాక్టర్ కృష్ణ ఉన్నారు.
చదువులో మరింత ఉన్నతంగా రాణించాలి
కామారెడ్డిటౌన్, వెలుగు ఎస్సెస్సీ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్‌ను సోమవారం కలెక్టర్ సన్మానించారు. బామన్ రమేశ్ (మార్క్‌లు 587), పైడి మౌర్యానాంద్రెడ్డి ( 581). ఛైతన్య ( 570 ), శివ ( 576), అనిరుద్ ( 572), ఎం. రక్షిత ( 579) లను కలెక్టర్
సన్మానించారు.