బోధన్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ : ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

బోధన్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ : ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని శక్కర్​నగర్, పాన్​గల్లి, రాకాసిపేట్ ప్రాంతాల్లో బుధవారం ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్​ సర్కార్​ నెరవేర్చుతుందన్నారు.  లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5లక్షల సాయం అందనుందన్నారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్​బీన్ హందాన్​,  గ్రంథాలయ జిల్లా చైర్మన్​ అంతిరెడ్డి రాజరెడ్డి, మాజీ మున్సిపల్​ చైర్​పర్సన్ పద్మశరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, తహసీల్దార్​ విఠల్, ఏసీపీ పి.శ్రీనివాస్​, మున్సిపల్​ ఏఈలు, కాంగ్రెస్​ పార్టీ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయాన్ని విజిట్ చేసిన ఎమ్మెల్యే 

ఎడపల్లి, వెలుగు  : ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే  సుదర్శన్ రెడ్డి విజిట్ చేశారు. ఎంపీడీవో శంకర్​అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.  సిబ్బందిని పలు ప్రశ్నలు అడుగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

లింగంపేట మండల కేంద్రంలో..

లింగంపేట, వెలుగు : లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు భూమిపూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన15 నెలల వ్యవధిలోనే  పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు.  అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, కరెంట్​ షాక్​తో చనిపోయిన బాధిత కుటుంబీకులకు పరిహారం చెక్కులను  ఎమ్మెల్యే అందజేశారు. 

అంతకు ముందు మండలంలోని  పర్మల్ల  గ్రామంలో పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్​కో  డీఈఈ  విజయసారథి, ఏడీఈ చీకోటి మల్లేశం, ఎంపీడీవో నరేశ్,​మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ జొన్నల రాజు,​ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్, నాయకులు వంజరి ఎల్లమయ్య, అట్టెం శ్రీనివాస్, ప్రసాద్ గౌడ్, బాలాగౌడ్  పాల్గొన్నారు.