గెలుపే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

 గెలుపే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
  • ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి బీజేపీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం ఆలూర్ మండల కేంద్రంలో జరిగిన బీజేపీ మండల సమావేశంలో మాట్లాడారు. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.  బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టపడితేనే ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సుర శ్రీకాంత్, మారంపల్లి గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, కొత్తూరు గంగాధర్, గిరీశ్, అరుణ్, హర్ష హరీశ్, రాంరెడ్డి మోతే శ్రావణ్య, డిష్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ పాలనలో రూ.కోట్లు వృథా.. 

బీఆర్ఎస్ పాలనలో సెలబ్రిటీలతో ఫొటోలు దిగేందుకు మొక్కలు నాటి రూ.కోట్లు వృథా చేశారని ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి విమర్శించారు. మంథని గ్రామంలో శుక్రవారం వనమహోత్సవానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టి మాట్లాడారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం  ఏటా రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి రెండు లక్షల మొక్కలు కూడా నాటలేదన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించాలని కాంగ్రెస్​ ప్రభుత్వం వన మహోత్సవాన్ని చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివాజీ, ఎంఈవో పింజ రాజగంగారాం, ఏవో హరికృష్ణ, ఏపీవో సురేశ్ పాల్గొన్నారు.