
పినపాక, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం పినపాక మండలం జానంపేట గ్రామంలో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
అనంతరం అమరారం నుంచి కిష్టాపురం వరకు రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండల అధ్యక్షుడు రామనాథం, నాయకులు పేరం వెంకటేశ్వర్లు, కంది సుబ్బారెడ్డి, పాటి బండ్ల సత్యనారాయణ, ఉడుముల లక్ష్మారెడ్డి, కొర్స ఆనంద్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, తహసీల్దారు గోపాలకృష్ణ, ఎంపీడీవో సునీల్ శర్మ పాల్గొన్నారు.