సొంతింటి కలను నెరవేరుస్తున్నాం : పాయం వెంకటేశ్వర్లు

సొంతింటి కలను నెరవేరుస్తున్నాం : పాయం వెంకటేశ్వర్లు
  • ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారి సొంతింటి కలను నెరవేరుస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సమితిసింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మండలంలోని అర్హులైన 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామన్నారు. 

అనంతరం 31 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ 14.80లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీవో తేళ్ల శ్రీనివాసరావు, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు తోపాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.