పినపాక నియోజకవర్గంలో రూ. 65 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభం

పినపాక నియోజకవర్గంలో రూ. 65 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభం

పినపాక, వెలుగు:  పినపాక నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.  మండలంలోని ఏడూళ్ల బయ్యారం, పాతరెడ్డిపాలెం, వెంకట్రావుపేట, ఎల్చిరెడ్డిపల్లి, జగ్గారం గ్రామాల్లో ఆయన సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో రూ.65లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.

 నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ..  ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా కాంగ్రెస్​ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్​కుమార్​, పీఆర్​ ఇంజనీరింగ్​ ఆఫీసర్లు, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు రామనాథం తదితరులు పాల్గొన్నారు.