అయ్యప్ప మాలలో ఉన్నా.. విచారణకు రాలేను : పైలెట్ రోహిత్ రెడ్డి

అయ్యప్ప మాలలో ఉన్నా.. విచారణకు రాలేను : పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరుకావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ ఆఫీసుకు వెళ్తున్నానని మణికొండలోని తన నివాసం నుంచి బయల్దేరిన రోహిత్ రెడ్డి.. ప్రగతి భవన్ చేరుకున్నాక మనసు మార్చుకున్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశం అనంతరం ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి సమాచారం ఇచ్చారు. విచారణకు హజరయ్యేందుకు అధికారులు షార్ట్ నోటీస్ ఇవ్వడంపై రోహిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉన్నందున సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని తన పీఏ శ్రవణ్తో ఈడీ ఆఫీసుకు లేఖ పంపారు. కేసీఆర్తో భేటీ తర్వాత కూడా పైలెట్ రోహిత్ రెడ్డి ఇంకా ప్రగతి భవన్ లోనే ఉన్నారు.

వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు 2015 నుంచి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను అందించాలని ఈడీ ఆయనను ఆదేశించింది. ఆధార్  కార్డు, పాస్ పోర్టు సహా విద్యార్హతలు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను సైతం ఈడీ అధికారులు అందించిన ఫార్మాట్ లో తీసుకురావాలని చెప్పారు.