బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో నల్లాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో నల్లాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, వెలుగు:బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్త నల్లాలను ప్రారంభించారు. అనంతరం కాలనీలోని బోనాల పండుగలో పాల్గొన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీ మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, కార్యదర్శి చందు, సీనియర్ జర్నలిస్టులు మల్లికార్జున స్వామి, రాజేశ్వర్ రెడ్డి, మోయిన్, ప్రసాద్, కమిటీ సభ్యులు, మహిళలు మహాదేవి, శ్రీదేవి, హరిత, సంజన, అనిత, రజిత, మనీషా, సాత్విక, కరుణ, రాజ్యలక్ష్మి, సావిత్రి పాల్గొన్నారు.