కుటీర పరిశ్రమలతో మహిళలకు ఉపాధి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

కుటీర పరిశ్రమలతో మహిళలకు ఉపాధి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

బాన్సువాడ, వెలుగు : కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం బాన్సువాడలోని పాత వీక్లీ మార్కెట్ భవనంలో డ్వాక్రా, మెప్మా మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు పరిశ్రమను సంప్రదించి ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను తీసుకొచ్చి మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మంజూరు చేయనున్నామన్నారు. మహిళలు తమకు నచ్చిన పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం లోన్లు మంజూరు చేస్తుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్​తోపాటు కాస్మోటిక్స్, వస్త్రాలు, చేతి వృత్తులు తదితర వాటిని ఎంచుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్  కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.