
- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
వర్ని, వెలుగు : ‘సొసైటీలు కల్పవృక్షం వంటివి.. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి..’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో రూ. 48 లక్షల తో నిర్మించిన సహకార సంఘం ఎరువుల గోదాంను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మాజీ సీఎం ఎన్టీఆర్ సింగిల్ విండోలను ఏర్పాటు చేశారన్నారు. నాటి నుంచి రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం సాగు పనులు జోరుగా సాగుతున్నాయని, సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు.
సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, సింగిల్‌విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, తహసీల్దార్ తారాభాయి, సింగిల్ విండో మాజీ చైర్మన్ పత్తి రాము, తోట సంగయ్య, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, సింగిల్‌విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.
నెమ్లి గ్రామంలో..
నస్రుల్లాబాద్, వెలుగు : మండలంలోని నెమ్లి గ్రామ హై స్కూల్లో రూ. 40.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.