సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలు : ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి

సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలు : ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి
  • ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్​ రెడ్డి

నస్రుల్లాబాద్, వెలుగు : సర్కార్​ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జహీరాబాద్​ ఎంపీ సురేశ్​షెట్కార్,  అగ్రోస్ చైర్మన్​ కాసుల బాల్​రాజు,  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​లతో కలిపి ప్రారంభించి మాట్లాడారు. రూ. కోటి 43 లక్షలతో  పీహెచ్​సీని నిర్మించినట్లు తెలిపారు. దవాఖానలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

గర్భణులకు మెరుగైన సేవలు అందించాలని, నార్మల్​ డెలివరీలు అయ్యేలా చూడాలన్నారు. ప్రైవేటు ఆస్పిటల్స్​కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు.  కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎంహెచ్​వో విద్య, జిల్లా ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, లీడర్లు పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 

కోటగిరి : రూ.200 ల కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్‌‌‌‌లో ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. సోమవారం పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ లో రూ.200 కోట్ల తో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులకు జహీరాబాద్ ఎంపీ  సురేశ్​షెట్కార్, అగ్రోస్ చైర్మన్ బాలరాజు తో కలిసి భూమి పూజ చేశారు. 

మూడు వేల మంది విద్యార్థులు చదువుకునేలా ఒకే కాంప్లెక్స్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, మాజీ జడ్పీటీసీ పుప్పాల శంకర్,శంకర్ పటేల్, తహసీల్దార్ గంగాధర్, ఎంఈవో శంకర్ 
పాల్గొన్నారు.