
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ శివారులోని చింతల నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. లీకేజీలను మూసివేసి నీళ్లు వృథా కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
నిజాంసాగర్ నీటిని విడుదల చేయండి..
నిజాంసాగర్ ఆయకట్టు కింద పొలాలు ఎండిపోతున్నందున నీళ్లు విడుదల చేయాలని ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌ను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోరారు. రైతు క్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట రైతులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ నాయక్, మట్ట సాయిలు, గుడాల నగేశ్ తదితరులు ఉన్నారు.