ఆలయాల నిర్మాణాలకు రూ.150 కోట్లు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి

ఆలయాల నిర్మాణాలకు రూ.150 కోట్లు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి

కోటగిరి, వెలుగు:  నియోజకవర్గంలోని ఆలయాల నిర్మాణాలు, మరమ్మతులకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సాయి, అయ్యప్ప ఆలయాల ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడిచినప్పుడే లోకంలో భక్తి విరాజిల్లుతుందన్నారు. విఠల్ సేట్ కృషితో ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.  

కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు పోల విఠల్ సేట్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ జడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీటీసీలు, కేశవీరేశ,కొట్టం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

రాణంపల్లిలో అభివృద్ధి పనులకు భూమి పూజ 

వర్ని :  రుద్రూర్​ మండలం రాణంపల్లి గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మించే మెటల్​ రోడ్డు నిర్మాణానికి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మంగళవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాణంపల్లి గ్రామాన్ని నా సొంత గ్రామంగా భావిస్తానన్నారు. బీఆర్ ఎస్​ ప్రభుత్వ హయాంలో బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. మున్నూరు కాపు సంఘం భవనంలో వంటగది నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని తెలిపారు.