ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మార్చి 6కు వాయిదా : సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మార్చి 6కు వాయిదా : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు :  తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ మరోసారి వాయిదా వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీని ప్రతివాదిగా పేర్కొంటూ గతేడాది తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం రిజిస్ట్రార్ శశిధర శెట్టి ఈ పిటిషన్ పత్రాలను పరిశీలించారు.

తెలంగాణలో ప్రభుత్వం మారిందని పోలీసుల తరపు న్యాయవాదులు రిజిస్ట్రార్ కు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్‌‌ మారిన విషయాన్ని విన్నపించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో మార్చి 6 న ఈ అంశాన్ని పరిశీలిస్తా మని రిజిస్ట్రార్ వెల్లడించారు.