ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు

ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. తమకు పదవులుచ్చినందుకు సీఎం కేసీఆర్ కు  థ్యాంక్స్ చెప్పారు నేతలు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు వారి వారి సొంత నియోజకవర్గాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నాయకుల్ని సన్మానించి.. ఫొటోలు దిగారు.