
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గోపన్ పల్లి గ్రామ సర్వే నంబర్ 37లో ఉన్న గుడిసెలు కుల్చివేసిన ప్రాంతాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. TRS ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని అన్నారు ఎమ్మెల్యే రఘునందన్. 30 సంవత్సరాలుగా ఉంటున్న ప్రజల గుడిసెలు తోలగించి వారి బతుకులను రోడ్డు పాలు చేశారన్నారు. ప్రతి సమస్యను ట్విట్టర్ లో పరిష్కరించే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కంటికి ఈ సమస్య కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పేద ప్రజలకు అండగా పోరాడుతుందన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.