మోదీ అంటే విశ్వాసం... కేసీఆర్ అంటే మోసం..

మోదీ అంటే విశ్వాసం... కేసీఆర్ అంటే మోసం..

కేసీఆర్ మోసాలపై  రాస్తే రామాయణం..చెప్తే భాగవతం అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  తెలంగాణ వచ్చాక ఓపెన్ కాస్ట్ గనులుండవు అన్న కేసీఆర్.. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ గనులే ఎక్కువ అయ్యాయని విమర్శించారు. 2 జూన్ 2014 నాడు సింగరేణి లో ఉన్న  కార్మికుల సంఖ్య ఎంత..?  అక్టోబర్ 2  2023లో ఉన్న కార్మికుల సంఖ్య ఎంత అని ప్రశ్నించారు. 

ఎమ్మెల్సీ కవిత కూడా మోసం బాటలో పయనిస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్  బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన కవిత...ఎంత మంది మహిళలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని కేసీఆర్ను అడగాలని సూచించారు. 

బీజేపీ మీటింగ్కు  బీఆర్ఎస్ వాళ్ళు జనాలను పంపించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని..ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి, కవితలకు వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. 

బీజేపీ పేదల కోసం పుట్టిన పార్టీ అన్నారు రఘునందన్ రావు. దేశం కోసం దేశాభివృద్ధి కోసం పనిచేస్తోందని చెప్పారు. కొత్త పార్లమెంట్లో మొట్టమొదటి బిల్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదీది అని కొనియాడారు.