కరోనా సమయంలో ఆదుకుంది బీజేపీ ప్రభుత్వమే : ఎమ్మెల్యే రఘునందన్ రావు

కరోనా సమయంలో ఆదుకుంది బీజేపీ ప్రభుత్వమే : ఎమ్మెల్యే రఘునందన్ రావు
  •    కరోనా సమయంలో ఆదుకుంది బీజేపీ ప్రభుత్వమే
  •     ఎమ్మెల్యే రఘునందన్ రావు

తొగుట (దౌల్తాబాద్), వెలుగు : కరోనా సమయంలో దేశాన్ని ఆదుకుంది బీజేపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలంలోని చెట్లనర్సంపల్లి, మాచిన్ పల్లి, అప్పాయి పల్లి, తొగుట మండలంలోని వర్దరాజుపల్లి, గోవర్ధన గిరి, గుడికందుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పదేండ్ల బీఆర్‌‌ఎస్​ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రామానికి ఒక్కరిద్దరికీ మాత్రమే బీసీబంధు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పనిచేసిందని విమర్శించారు.

రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజక వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పింఛన్లు ఇచ్చి అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాలలో ముందంజలో ఉందని ఎద్దేవా చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో  యువతను మద్యం మత్తులో ముంచుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు కొలువులు ఇవ్వలేదని మండిపడ్డారు.

కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ర్టంలో అభివృధి జరిగిందని చెప్పారు.  బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతాడని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ను ఎన్నుకోవాలని కోరారు.  కార్యక్రమంలో పార్టీ  అధ్యక్షులు చిక్కుడు చంద్రం, కిషన్, నాయకులు విభీషణ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, స్వామి రెడ్డి, కల్యాణ్ దాస్, సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు.