బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాకపోయేదని మంత్రులే అన్నారు

V6 Velugu Posted on Mar 25, 2021

బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాకపోయేదని స్వయంగా రాష్ట్ర మంత్రులే అన్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కేంద్రం డీపీఆర్‌లు అడిగిన మాట వాస్తవం కాదా అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రఘునందన్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం విషయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పిన లెక్కలు తప్పుగా ఉన్నాయని ఆయన అన్నారు. దేశ భక్తి ఎవరికి ఎంత ఉందో అందరికి తెలుసునని మంత్రి హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు. మేం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని మంత్రులే చాలా సార్లు చెప్పారని రఘునందన్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు.
 

Tagged Bjp, TRS, Telangana, Minister Harish rao, ASSEMBLY, MLA Raghunandan Rao

Latest Videos

Subscribe Now

More News