కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే... మళ్లీ బీఆర్ఎస్ లో వెళ్లడం ఖాయం

కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే... మళ్లీ బీఆర్ఎస్ లో వెళ్లడం ఖాయం

కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం(అక్టోబర్ 20) దుబ్బాకలో ఏర్పాటు చేసిన బిజెపి సభలో ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ.. దుబ్బాకలో తాను అధికారంలోకి వచ్చాక  ఎన్నో అభివృద్ధి పనులు చేశా అని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 100 పడకల దవాఖానను పూర్తి చేసి పేదలకు వైద్యం సౌకర్యం అందిస్తున్నామాని చెప్పారు. దుబ్బాక బస్టాండ్ విషయంలో ఎంతో మంది నాయకులు నిర్లక్ష్యం వహించారు.. కానీ, తన హయంలోనే కొత్త బస్టాండ్ ను నిర్మించామని తెలిపారు. తాను అడిగా కాబట్టే దుబ్బాక లో రోడ్లు చక్కబడినాయన్నారు.

దుబ్బాకలో 1000 డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించానని.. అధికార పార్టీ నాయకుల మెడలు వంచి దుబ్బాకకు అభివృద్ధిని తీసుకొచ్చానన్నారు.  సిద్ధి పేట,దుబ్బాక రెండు కళ్ళు అని చెబుతున్న హరీష్ రావుకు దుబ్బాకలో సమస్యలు ఎందుకు కనబడట్లెదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తమపై కేసులు పెట్టి అరెస్ట్ లు చేసినప్పటికీ దుబ్బాక ప్రజలు తనను గెలిపించి ఆశీర్వదించారన్నారు.

కొలువులు లేక నిరుద్యోగ యువత ఎన్నో అవస్థలు ఎదుర్కుంటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబానికి లక్ల్లో జీతాలు వస్తున్నాయి కానీ.. పేదల కుటుంబాల్లో ఉద్యోగాలు ఎందుకు రావడం లేదో ప్రజలు అడగాలని చెప్పారు.  జై తెలంగాణ అని పోరాడిన వాళ్ళు అంతా సైకిళ్లపై తిరుగుతుంటే.. బిఆర్ఎస్ నాయకులు మాత్రం ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాక అభివృద్ధి కోసం తాను అనునిత్యం పోరాడుతూనే ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ చెప్పారు.