అంగన్​వాడీల సమ్మెకు ఎమ్మెల్యే మద్దతు : రఘునందన్ రావు

అంగన్​వాడీల సమ్మెకు ఎమ్మెల్యే మద్దతు : రఘునందన్ రావు

తొగుట, వెలుగు : అంగన్​వాడీలు తొగుట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు గురువారం ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్​వాడీలను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

గృహలక్ష్మి, దళిత బంధు, బీసీలకు ఆర్థికసాయంలో అంగన్​వాడీలకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం మండలంలో ఇటీవల మృతి చెందిన పద్మాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.