అసెంబ్లీ రూల్స్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డితో చర్చకు సిద్ధం 

అసెంబ్లీ రూల్స్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డితో చర్చకు సిద్ధం 

హైదరాబాద్ : అసెంబ్లీ రూల్స్ పై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో చర్చించేందుకు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ కు వెళ్లారు. ఉదయం తాను ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చానని అన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి కోసం ఎదురుచూశానని, కానీ ఆయన మాత్రం రాలేదన్నారు. ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో బాగా బిజీగా ఉండి రాలేకపోవచ్చు అంటూ సెటైర్ వేశారు.

అసెంబ్లీ రూల్స్ పై ఇవాళ కాకపోతే మరో రెండు, మూడు రోజుల్లో అయినా ప్రశాంత్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఉంటారని వచ్చానని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని సాయంత్రం 4 గంటలకు కలుస్తానని ఉదయం బీజేపీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు. అలా చెప్పినట్టుగానే ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీకి వెళ్లారు.