
హైదరాబాద్: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ గుర్తు తెలియని ఫోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో తెలిపారు. దీంతో బెదిరింపు కాల్స్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. గతంలోనూ రాజాసింగ్ చంపుతామంటూ ఇలాగే బెదిరింపు కాల్స్ రావడంతో .. అప్పటి డీజీపీ అంజనీ కుమార్ కు లేఖ కూడా రాశారు.