
గత మూడు రోజుల క్రితం మల్కాజిగిరిలో టీఆర్ఎస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. న్యాయం కోసం నిరసన వ్యక్తం చేసిన బీజేపి నాయకులపై దాడిని ఆయన ఖండించారు.
ఈ నెల 23న మల్కాజిగిరిలో ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆర్‌యూబీ సమస్యపై సమావేశం నిర్వహించారు. మైనంపల్లి మాట్లాడుతున్న సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు ఆర్‌యూబీ ఆలస్యంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బక్క నాగరాజు, శ్రీనివాస్ లకు గాయాలయ్యాయి