న్యూ ఇయర్ వేడుకలు, నుమాయిష్కు పర్మిషన్ ఎట్లిస్తరు?

న్యూ ఇయర్ వేడుకలు, నుమాయిష్కు పర్మిషన్ ఎట్లిస్తరు?

హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఎలా అనుమతి  ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో భయాందోళనలు నెలకొన్నాయని.. చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకల్లో అనేక నిబంధనలను విధించాయన్నారు. కానీ తెలంగాణలో మాత్రం రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నుమాయిష్ కు పర్మిషన్ ఇవ్వడం పైనా రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. ‘గోషా మహల్ నియోజకవర్గంలో ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ ఎగ్జిబిషన్ కు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు. దీని వల్ల కరోనా భారీ స్థాయిలో వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వెంటనే ఎగ్జిబిషన్ ఏర్పాట్లను నిలిపివేయాలి’ అని రాజా సింగ్ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

31 రాత్రి పబ్ లు, బార్లపై నజర్

రియలిస్టిక్ సినిమాలే నా బలం