తెలంగాణలో 12 సీట్లు గెలుస్తం : ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌

తెలంగాణలో 12 సీట్లు గెలుస్తం : ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌

ఖానాపూర్/ఆదిలాబాద్‌‌‌‌, వెలుగు : రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌‌‌‌ షా చెప్పినట్లు ఫేక్‌‌‌‌ వీడియోలను సృష్టించింది సీఎం రేవంత్‌‌‌‌రెడ్డేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలు రెండూ ఒక్కటేనని, వారు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. బుధవారం రాత్రి ఖానాపూర్‌‌‌‌, ఇచ్చోడలో నిర్వహించిన రోడ్‌‌‌‌షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, కేంద్రంలో బీజేపీ రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు.

 తెలంగాణ రాష్ట్రానికి మోదీ వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలోనే హోంమంత్రి అమిత్‌‌‌‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌కు పట్టిన గతే రేవంత్‌‌‌‌రెడ్డికీ పడుతుందన్నారు. కార్యక్రమంలో అదిలాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే పాయల్‌‌‌‌ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌‌‌‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, రితీశ్‌‌‌‌ రాథోడ్ 

పాల్గొన్నారు.