కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. 30 ఏండ్లుగా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేశానన్నారు. ప్రజాప్రతినిధిగా సోనియా నేతృత్వంలో ప్రస్తానం కొనసాగించానన్నారు.  సోనియాపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడం బాధేసిందన్నారు. అనేక పార్టీలు మార్చి.. జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నాయకత్వంలో ఎట్టిపరిస్థితిలో పనిచేయలేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నూతన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నానన్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు.ఎందరో త్యాగాలు..అందరి పోరాటంతో సాకారమైన తెలంగాణరాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో బంధీ అయిందని తెలిపారు. ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణలో మరో ప్రజాస్వామ్య పోరాటం అవసరమన్నారు.అందుకే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. 

మరోవైపు ఈ నెల 8న రాజగోపాల్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు స్పీకర్.  ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.హస్తం నేతలు బుజ్జగింపులు.. సంప్రదింపులు జరిపినా అవి ఫలించలేదు. మునుగోడు ఎమ్మెల్యే పదవీకి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం అధికారికంగా స్పీకర్ ను కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.