బక్రీద్ కు ఆవులు, దూడలు కోస్తే ఊరుకోం.. ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

బక్రీద్ కు ఆవులు, దూడలు కోస్తే ఊరుకోం.. ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు కోస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాటిని కోయరాదని గుర్తుచేశారు. మేకలు, గొర్రెలు కోసుకొని బక్రీద్ చేసుకుంటే తమకెలాంటి అభ్యం తరం లేదని ఆదివారం ఒక ఆయన ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న బక్రీద్ సందర్భంగా ఈ అంశాలపై డీజీపీకి రాజాసింగ్ లేఖ రాశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్ట లేదని, కనీసం చెక్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.

మీకు చేతకాకపోతే ఆవులు, దూడలు రక్షించుకునేందుకు తామే రంగంలోకి దిగుతామన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నా.. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.