ఛత్తీస్గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రానికి చెందిన17 మంది మావోయిస్టులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలోని పోలీస్​ హెడ్​ క్వార్టర్లో గురువారం మీడియా సమావేశంలో  భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్​ రాజు వివరాలు వెల్లడించారు. ఇద్దరు ఏసీఎంలు, నలుగురు పార్టీ మెంబర్లు, 11 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు చెప్పారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారని తెలిపారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకు 282 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.